- 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కామారెడ్డి న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- సెలవులు రద్దు చేస్తూ ప్రకటన -ఆరోగ్య శాఖ మంత్రీ
- రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృతి
- పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
- చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
- గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్ ఏకగ్రీవం ఉపాధ్యక్షులుగా మెరుగు బద్రి
- కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి
Author: goutham
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి మండల పరిధిలో ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల విశ్వనాధం, రావి పాపారావు, చింతకాయల పుల్లారావు,చిలకా మునిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్,ఉపాధ్యక్షులుగా మెరుగు వీరబద్రరావు,ప్రధాన కార్యదర్శిగా తిరుమల శెట్టి రాఘవ రావు, కోశాధికారిగా ఎక్కిరాల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా చింతకాయల మారేష్,వాసం వెంకటేశ్వర రావు, కార్యవర్గ సభ్యులు 16మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మాకు అప్పజెప్పిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని శక్తి వంచన లేకుండా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ అవకాశం కల్పించిన నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి…
ఇందూర్ వార్త ప్రతినిధి గౌతమ్ జనవిజ్ఞాన వేదిక,తిరువూరు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నాగార్జున పాఠశాల లో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి తిరువూరు మరియు పరిసర జిల్లాలైన కృష్ణా,ఖమ్మం జిల్లాలనుండి కూడా 950 మంది హాజరయ్యారు.వీరికి రెండు నెలలకు సరిపడ మందులను అందచేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బి.పి,షుగర్ లు కేవలం మందుల వాడకం తోనే నియంత్రణ లో ఉండవని,సరైన ఆహార నియమాలు పాటించాలని,రోజులో రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలని, ఒక్కపూట తప్పనిసరిగా తృణ ధాన్యాలను వాడాలని,క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డా.సత్య తేజ, డా.వి.రవీంద్ర, డా.లక్ష్మణరావు,డా.శివాజీ,మదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ విద్యార్థులు,జనవిజ్ఞానవేదిక సభ్యులు వాలంటీర్ లుగా పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు యం.హరికృష్ణ, యం.సుధాకర్,కె.పాపారావు,కె.లక్ష్మణరావు, రాజశేఖరరెడ్డి,సాంబశివరావు,ఆంజనేయులు, నాగేశ్వరరావు నాగేంద్రప్రసాద్,సురేష్,శ్రీను,రవి ,తదితరులు పర్యవేక్షించారు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ దశాబ్ద కాలం తర్వాత సొంత ఇంటి కల నెరవేరిన ఆనందంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానందుకు కృతజ్ఞతలు తెలియజేశారు మున్సిపాలిటీ పరిధిలో షాది ఖానా ఆవరణంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే రాగమయికి లబ్ధిదారులు ,స్థానిక నాయకులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో పేదలకు ఇండ్లు మంజూరు చేయలేదని, నామ మాత్రంగా ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నివాసానికి ఉపయోగంగా లేవని ,సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని ,వర్షం వస్తే ఇండ్లు కురుస్తున్నాయని కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి…
ఎంపీ నిధులతో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు హామీ ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి ఆదివారం కల్లూరు మినీ స్టేడియాన్ని సందర్శించారు. అనంతరం చిన్న పిల్లలతోకాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు పసుపులేటి వీర రాఘవయ్య చిన్నపిల్లలకు సంబంధించిన చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని పొంగులేటి సతీమణి మాధురి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన పొంగులేటి సతీమణి ఖమ్మం ఎంపీ రామసహయం రఘురామి రెడ్డి నిధుల నుండి 10 లక్షల రూపాయలు తో నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పిల్లలకు కావలసినటువంటి జారుడుబల్లలు, స్ప్రింగ్ బోర్డులు, రొటేటింగ్ వీల్స్, స్ప్రింగ్ బోర్డ్స్, అన్నిటిని ఏర్పాటు చేయటానికి ఖమ్మం ఎంపీ నిధులనుండి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయుటకు ఆమోదం తెలిపిన సందర్భంగా క్రీడా ప్రాంగణమునకు…
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ కల్లూరు మండలం పేరువంచ గ్రామం లో కీ “శే “లు కళ్లేపల్లి సామెలు దశ దీన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ కార్యక్రమం లో కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు,కల్లూరు మండలం, కల్లూరు పట్టణం, పేరువంచ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి….. ఇంటి సరిహద్దులు తేల్చడంటూ ఎమ్మార్వో,ఎంపీడీఓ కి వినతిపత్రం. ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ నివాసముంటున్న ఇంటి స్థలం వివాదాస్పదంగా మారిన ఘటన మండల పరిధిలోని తూర్పు లోకారంలోని చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం ఇంటి నెంబర్ 1-82/1 గల రేకుల షెడ్డులో ఇలారపు మధు, తండ్రి నగేష్ తన భార్య ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తన బాబాయి కుమారుడైన ఇలారపు శివ వద్ద కొనుగోలు చేశాడని తెలిపారు. ఏప్రిల్ 25 వ తారీఖున అదే గ్రామానికి చెందిన తడికమళ్ల కృష్ణ మరియు మరో వ్యక్తులు కలిసి మా రేకుల షెడ్డు ను ధ్వంసం చేసి మాపై దాడి చేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత మే రెండవ తేదీన…
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండాల రెపరెపల నడుమ కార్మిక సంఘాలు 139 వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని అన్నారు. కార్మిక సంఘాల నాయకులు రక్త తర్పణ, జైలుకెళ్లి, హింసించబడి, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడని అవి అమలు అయితే కార్మికులు రోడ్డున పడి అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత 9…
రైతులది బిచ్చగాళ్ళ బ్రతుకులాయే అధికారులు పట్టించుకోరాయే.. మిల్లర్లు రారాయే..! ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా పక్కనే మిల్లర్లు, గ్రామంలో ఐకెపి సెంటర్, సొసైటీ ఉన్నప్పటికీ రైతుల ధాన్యం కొనేవాళ్లు లేక నెల దాటిన యార్డులోనే ములుగుతూ ఎప్పుడు కొంటారోనని ఎదురుచూపులు చూస్తూ దీనస్థితిలో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి మండల పరిధిలోని కొర్లగూడెం రైతులది. అష్ట కష్టాలు పడి పంట పండించి అమ్ముకోవాల్సి వచ్చేసరికి రైతులకు చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో ఐ కె పి సెంటర్ నందు ధాన్యం ఆరబోసి నెల దాటిన కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొంతమందివి కాంటా వేసినప్పటికీ ఇంకా కల్లాలోనే ఉన్నాయని తెలిపారు. మా పరిస్థితి ఏంటని నిలదీస్తే లారీ మీరే తెచ్చుకోండి మిల్లర్లతో మీరే మాట్లాడుకోండని అప్పుడు కొంటామని సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ధాన్యం కొంటామని ఒప్పుకొని పక్క జిల్లాలోని…
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ మండ పరిధిలోని పేరువంచ గ్రామానికి చెందిన మంచాల సుజాత కానిస్టేబుల్ టూ గ్రూపు వన్ ఆఫీసర్ గా కొలువును సాధించిన మంచాల సుజాతని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మండలం సీనియర్ కాంగ్రెస్ నాయుకులు పసుమర్తి చంద్రరావు,మండలం కాంగ్రెస్ నాయుకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలు రాష్ట్రాల్లో సీడీఏ సేవలు అభినందనీయం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేందర్ గౌడ్. ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ ఇంటికి దీపం ఇల్లాలంటారు.ఏ ఇంట్లో అయితే మహిళలు ఆర్థికంగా వెలుగుతుంటారో ఆ కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుంటాయనే సంగతి జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి” సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్” సంస్థ పనిచేయడం గర్వించదగ్గ విషయమని శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలోని చండ్రుపట్ల రోడ్డు నందు సి డి ఏ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేందర్ గౌడ్ అన్నారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం హర్షణీయమన్నారు.సి డి ఏ నిర్వాహకులు రెవరెండ్ పి ఎనోష్ కుమార్ ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టుమిషన్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…