Author: ఇందూర్ వార్త

*పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు* పేదల ఇళ్ల స్థలాలను అక్రమంగా బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని డా.వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో పేదల బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను ఎమ్మెల్యే అనుచరులు టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చెన్నారం గ్రామంలో ఆక్రమణకు గురైన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం చెన్నారం గ్రామంలో 140 సర్వే నెంబర్ లో 6 ఎకరాల 36 గుంటల భూమినీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2005 అప్పట్లో మంత్రి గొల్లపల్లి సూర్యారావు ద్వారా సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు.పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఎమ్మెల్యే…

Read More

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న. ఇవాళ ఉదయం షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో సాయన్నను ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సాయన్న. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న.

Read More

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బాన్స్వాడ ఆధ్వర్యంలో భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ..స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు.. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు నరసింహ చారి, ప్రధాన కార్యదర్శి శంకర్, రాష్ట్ర బాధ్యులు రమేష్ కుమార్, రవీంద్రనాథ్ ఆర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్, జిల్లా బాధ్యులు వేద ప్రకాష్ బాలరాజు, J రాజు, అరుణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ,కిష్టయ్య , శ్రీనివాస్, సంజీవరెడ్డి, సాయిలు,నరసయ్య ,నాగేష్, విజయ్ కుమార్, తదితర ఉపాధ్యాయులు ,విద్యార్థులు యువకులు పాల్గొనడం జరిగింది

Read More

రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా*రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా*కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు వారి ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉచిత నువ్వుల విత్తనాలు సరఫరా చేశారు. 11 మంది ఎస్సీ రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరానికి మూడు కిలోల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మాట్లాడుతూ.. ఉచితంగా ఇచ్చిన విత్తనాలను రైతులు విత్తుకొని తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పొందాలని కోరారు. ప్రస్తుతం నూనె గింజల సాగు తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉందని రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా నూనె గింజలు కూడా పండించినట్టయితే ఆర్థికంగా లాభపడతారని తెలిపారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త నవీన్ మాట్లాడుతూ.. నువ్వులను జనవరి మరియు ఫిబ్రవరి నెలలో విత్తుకున్నట్టయితే ఎటువంటి చీడపీడలకు గురి కాకుండా పంట ఏపుగా పెరిగి సుమారు ఐదు…

Read More

*ఆరు గంటల ఆందోళన*-రేపు కామారెడ్డి బంద్ కు రైతుల పిలుపు-ఎంపీ అరవింద్ ను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు -రఘునందన్ వర్సెస్ ఎస్పీ ధమ్కీ మాటలుకామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నా సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు కొనసాగింది. మరో పది నిమిషాల్లో పోలీసులు అరెస్ట్ చేసి అవకాశం ఉండగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతులు కామారెడ్డి బంద్ కు పిలుపునిస్తూ ఆందోళన విరమించారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం అందజేయడంతో పాటు దిష్టిబొమ్మను కలెక్టరేట్ గేటు ముందు ఉంచి దిష్టిబొమ్మపై మహిళా రైతులు మట్టిని పోసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేపు కామారెడ్డి నియోజకవర్గ బంద్ కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపిచ్చింది.*ఎంపీ అరవింద్ ను అడ్డుకున్న పోలీసులు* రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి బయలుదేరి కాసేపట్లో కలెక్టరేట్ వరకు చేరుకునే…

Read More

*కాలనీ వాసులు ధర్నా.. డాంబార్ ప్లాంట్ మూసివేత*డాంబార్ ప్లాంట్ ఏర్పాటుతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతారని, వెంటనే ప్లాంట్ ఏర్పాటును తొలగించాలని ప్లాంట్ ముందు రోడ్డుపై గంటపాటు ఆందోళన చేపట్టడంతో ప్లాంట్ నిర్వాహకుడు వెంటనే ప్లాంట్ ను తొలగిస్తున్నట్టు రాతపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు, జిఆర్ కాలని ఈఎస్ఆర్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు, జిఆర్ కాలనీ వాసులకు ఇబ్బంది కలిగేలా ఈఎస్ఆర్ గార్డెన్ కు ఎదురుగా అమీన కన్ స్ట్రక్షన్ ఆధ్వర్యంలో డాంబార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈరోజు ప్లాంట్ ను మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినా అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన రద్దయింది. విషయం తెలుసుకున్న రెండు కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున ప్లాంట్ వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రహదారిని దిగ్బంధించి ధర్నా చేపట్టారు. ప్లాంట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.…

Read More

సావిత్రిబాయి పూలే స్పూర్తితో సమ సమాజాన్ని నిర్మిద్దాం.రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించరూఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విట్టల్ మాట్లాడుతూ సమాజంలో మహిళ విముక్తి విద్యతోనే ముడిపడి ఉందని గ్రహించి అసమానతలను రూపుమాపాలని కులం మతం భేదం లేకుండా అందరికీ విద్యను అందించాలని అగ్రకుల ఆధిపత్యం దాడులు చేసిన వెనకడుగు వేయకుండా మహిళ ఆభ్యుదయకోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రి పూలే అన్నారు.మహిళల హక్కుల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని విద్య , వైద్యం, ఉపాధి, పారిశ్రామికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా నేటి సమాజం ప్రోత్సహించాలన్నారు.ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య గారు మరియు అధ్యాపకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే…

Read More

*50 లక్షలతో వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్*అంబర్పేట :అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ వాసులతో సమావేశమై అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో అంబర్ పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగానే ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి, వరద నీటి పైప్ లైన్లు వేయడం, పార్కుల అభివృద్ధి, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి అనేక ఇతర పనులను చేపడుతున్నామని అలాగే ప్రజల నుండి వచ్చిన సమస్యలను…

Read More

*ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే* *ముస్లింలకు షాదీఖానా నిర్మించిన ఘనత ఉత్తమ్ దే*టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా.నూతన సంవత్సర సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కుల,మత రాజకీయాలకు అతీతంగా ముస్లిం సోదరులందరూ పాల్గొనాలని కోరారు.ఆత్మీయ సమ్మేళనం నూతన సంవత్సర జనవరి1వ,తేదీన కోదాడ కోమరబండలో జరగనున్న వేడుకల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అందరూ ఆహ్వానితులే అని అన్నారు.నల్లగొండ పార్లమెంటు సభ్యుడు,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు,అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయ సమ్మేళననీకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానం అందించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.ఉత్తమ్ హయాం లోనే ముస్లింలకు…

Read More

*భిక్షాటన డబ్బులు తీసుకోండి.. మా భూములు ఇచ్చేయండి*-మున్సిపల్ కార్యాలయం ముందు భిక్షాటన డబ్బులు కుమ్మరించిన రైతులు ‘మా భూముల్ని కాపాడుకునేందుకు నెల రోజులుగా పోరాడుతున్నాం. ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా కామారెడ్డిలో భిక్షాటన చేసినం. భిక్షాటన ద్వారా వచ్చిన ఈ డబ్బులు తీసుకుని మాస్టర్ ప్లాన్ లో భాగంగా మీరు గుంజుకున్న భూములను మాకు తిరిగి ఇచ్చేయండి’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్, 100 ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ నుంచి కొత్త బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా, రైల్వే కమాన్, సుభాష్ రోడ్, గంజ్ చౌరస్తా, ధర్మశాల, పాత బస్టాండ్, పంచముఖి హనుమాన్ ఆలయం, రైల్వే గేటు మీదుగా కొత్త బస్టాండ్ చేరుకున్నారు. కొత్త బస్టాండ్…

Read More