Author: ఇందూర్ వార్త

మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్… ఇందూర్ వార్త  – హైద్రాబాద్ కారణమిదేమూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు.. మార్కింగ్ సర్వే.. అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హైఅలెర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ సర్వే కూడా జరిగిపోయింది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్‌ కూడా వేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించేశారు కూడా. ఓల్డ్ మలక్ పేట్‌లో ఖాళీ చేయించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయనున్నారు. పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ సర్వే కొనసాగుతోంది.. వరద ఉధృతి.. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను…

Read More

రుణమాఫీ అందని రైతులెందరో! ముగిసిన వానకాలం… నేటి నుంచి యాసంగి షురూ… నేటికీ జాడలేని రైతు భరోసా వానకాలం అవస్థల ఎవుసం కొత్త రుణాలూ అరకొరే సాగర్‌లో నీళ్లున్నా సాగునీటికి కటకట రైతన్నను వెంటాడుతున్న ప్రభుత్వ వైఫల్యాలు ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ అక్టోబర్ 01  ఇందూర్ వార్త , వ్యవసాయంలో రైతులకు వానకాలం సీజన్‌ కీలకం. తరితోపాటు మెట్ట పంటలతో భూములన్నీ సాగులోకి వస్తాయి. ఏప్రిల్‌లో భూములను చదును చేయడం, ఆ తర్వాత దుక్కులు దున్నడంతో మొదలయ్యే వానకాలం సీజన్‌ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. అక్టోబర్‌ నుంచి యాసంగి సీజన్‌ మొదలవుతుంది. సోమవారంతో వానకాలం సీజన్‌ ముగిసినా వ్యవసాయంలో కీలకమైన సాగునీటి విడుదల, రైతు భరోసా, రుణమాఫీ, కొత్త రుణాల జారీ వంటి విషయాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు మొండిచెయ్యి చూపింది. గతంలో కేసీఆర్‌ సర్కార్‌లో రైతుల అవసరాలకు తగ్గుట్లుగా ప్రభుత్వం ఎంతో తోడ్పాటును అందించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కారు…

Read More

సమరసతా సాహిత్యంతో ఐకమత్యం సాధిద్దాం కామారెడ్డి indurvaartha కవులు రచయితలు సమరసతా సాహిత్యం సృష్టించి సమాజ ఐకమత్యాన్ని సాధించాలని సామాజిక సమరసతా వేదిక కళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బండిరాజుల శంకర్ పిలుపునిచ్చారు. సామాజిక సమరసతా వేదిక కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వశిష్ఠ డిగ్రీ కళాశాలలో సమరసతా మూర్తులు దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్న, చిలకమర్తి లక్ష్మీ నరసింహం ల జయంతి వేడుకలు మరియు కవి సమ్మేళనం జరిగింది. ప్రధాన వక్తగా హాజరైన బండ్రాజుల శంకర్ మాట్లాడుతూ హిందూధర్మంలో అంటరానితనానికి తావు లేదు అని సోదాహరణంగా రాముని జీవితాన్ని వివరించారు. కవులు సమాజాన్ని కలిపే వారని, సమాజ హితంకోరే కోరే సాహిత్యాన్ని వ్రాయాలని కోరారు. ఆదిశంకరులు, రామానుజులు, వివేకానందుల వంటి వారు మానవాళి హితం కోరే పద్ధతులను ఏర్పాటు చేశారని చెప్పారు. ఎక్కడా వివక్ష ని పాటించలేదని అన్నారు. మహనీయుల స్ఫూర్తి తో మనం సామాజిక సమరసతకు…

Read More

జాడలేని ఎస్‌ఎఫ్‌సీ నిధులు జాడలేని ఎస్‌ఎఫ్‌సీ నిధులు గ్రామ పంచాయతీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఇందూర్ వార్త వెబ్ డెస్క్  : సెప్టెంబర్ 27 డెస్క్:  గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ముఖ్యంగా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం- పచ్చదనం, త్వరలో నిర్వహించే బతుకమ్మ, దసరా పండగ సంబరాలకు నిధుల లేమి సమస్యగా మారనుందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాడితప్పిన పాలన.. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఫిబ్రవరి 2న ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల లేమి, సిబ్బంది జీతాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పంచాయతీ పాలన గాడితప్పుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగు కాలువల్లో పూడికతీత, విద్యుత్తు దీపాల ఏర్పాటు, తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీలు, ట్రాక్టర్లకు డిజిల్‌ కొరత ఇలా..…

Read More

పిల్లలమర్రిలో గ్రామంలో రసాభాస -అవినీతి అర్చకున్ని తిరిగి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు ఆగ్రహం -ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్న గ్రామ పెద్దలు -లక్షల్లో అవినీతికి పాల్పడ్డ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చేదే లేదని ముక్తకంఠంతో గ్రామస్తులు ఫైర్ ఒక్కొక్కటిగా అవినీతి చిట్టా సాక్షాలతో సహా విప్పడంతో అక్కడనుండి మెల్లిగా జారుకున్న సదరు పూజారి ఇందూర్  వార్త సూర్యాపేట  (పిల్లలమర్రి) : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయం ఎదుట 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకురి శ్రీనివాస్ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం రసాబసాగా మారింది. పలు అవినీతి ఆరోపణలతో గత రెండు నెలల క్రితం దేవాలయం నుండి తొలగించిన ఎరకేశ్వరాలయ పూజారి నందీశ్వర్ శర్మను తిరిగి తీసుకునేందుకు గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. గతాన్ని వదిలేసి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని గ్రామ పెద్దలు అనడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయానికి వచ్చే విరాళాలలో పెద్ద ఎత్తున…

Read More

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు.. ఇందూరు వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్ వార్త హైదరాబాద్ సెప్టెంబర్ 27 తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈ ఉదయం నుండి ఈ డీ అధికారులు సోదాలు చేపట్టారు ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడి బృందాలు మంత్రి నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి నివాసం సహా అతనికి సంబంధించిన నగరంలోని 16 చోట్ల ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Read More

కొండాపూర్ చెరువు పై హైడ్రా ఫోకస్ సంగారెడ్డి జిల్లా :సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్ షాయి పేట్ గ్రామ శివారులో 93 సర్వేనంబర్ లో ఉన్న చెరువును ఆక్రమించుకొని చెరువు నీటి మధ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. పూర్తిగా చెరువు లోనే భవనాలు నిర్మించడమే కాకుండా అందులో స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ హౌజ్ నిర్మించారు.మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణంలోని సర్వే నంబర్ 93లో ఎఫ్‌టీ ఎల్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎఫ్ టీఎల్ లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం చుట్టూ పెద్ద ఎత్తున నీరు చేరింది. పత్రికల్లో వరుస కథనాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమై అధికారులు ఈరోజు ఉదయం అట్టి నిర్మాణా లను నేలమట్టం చేశారు. చెరువులో భారీ భవనం.. బాంబులతో కూల్చేసిన అధికారులు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లో…

Read More

కోఠి ఉమెన్స్ కాలేజీకి వీరనారి ఐలమ్మ పేరు ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డ ఇందూ ర్ వార్త : డెస్క్ సెప్టెంబర్ 26 కోఠి ఉమెన్స్ కాలేజీకి వీరనారి ఐలమ్మ పేరు ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటానికి స్ఫూర్తిగా కోఠి ఉమెన్స్ కాలేజీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ కాలేజీగా నామకరణం చేశారు. ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నారు. అయితే నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపుమేరకు, హైదరాబాద్ రాజ్యంలో మహిళలకు విద్యతో సాధికారత కల్పించాలనే లక్ష్యంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కాలేజీని 1924లో స్థాపించారు.

Read More

రేషన్ డీలర్ల నియామకం గంభీరావుపేట సెప్టెంబర్ 26 ఇందూర్ వార్తా ప్రతినిధి గంభీరావుపేట మండలంలోని రేషన్ డీలర్ నియామకనికి దరఖాస్తు చేసుకోవగా బుధవారం రోజున రేషన్ డీలర్ల నియామకం నిర్వహించారు గంభీరావుపేటలోని వసీం సుల్తానా షాప్ నెంబర్ 30903005, ఎగదండి సుమలత షాప్ నెంబర్ 3903001, లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోతు అఖిల షాప్ నెంబర్ 3903027, రాజుపేట గ్రామానికి చెందిన సుద్దాల ప్రవళిక షాప్ నెంబర్39030028 గాల షాపులను ఆర్డిఓ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల షాపులను అర్హులకుకేటాయించారు.

Read More

ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక? హైదరాబాద్:సెప్టెంబర్ 24 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక నిర్ణయం తీసుకు న్నారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వారం రోజుల్లో విధి విధానాలు రూపొంది స్తామని రాష్ట్ర గ్రుహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మహబూబా బాద్, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి సోమ వారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ అభివ్రుద్ధి సమీక్షా సమావేశంలో అర్హుల కోసం డబుల్ బెడ్ రూమ్స్ గదుల ఇళ్ల పంపిణీపై త్వరలోనే నిర్ణయం…

Read More