Author: ఇందూర్ వార్త

లక్ష్మీపతి గూడెం లో గాలి కుంట వ్యాధి నివారణకు, టీకాలు:  ఇందూర్ వార్త :సంగారెడ్డి జిల్లా: బ్యూరో గోపాలకృష్ణ: జిన్నారం మండలం లోని లక్ష్మీపతి గూడెం గ్రామంలో, పాడి పశువులకు, గాలి కుంట నివారణ, టీకాలు వేశారు. పశువైద్యదికారి డాక్టర్ విశ్వ చైతన్య ఆధ్వర్యంలో గోపాలమిత్ర వైద్య సిబ్బంది నరేష్ కుమార్ మరియు అనిల్ కుమార్ వ్యాక్సినేషన్ లక్ష్మీపతి గూడెం గ్రామంలో పాడి పశువుల రైతులు పట్నం మల్లేశం, పట్న అశోక్ ,పాల్గొన్నరు .ఈ కార్యక్రమం మారో 30 రోజులవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని  జిన్నారం మండల,గ్రామాల ప్రతి ఒక్క,పాడి  రైతు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More

పోతంగల్ లో ఇండియన్ బ్యాంక్ ప్రారంభము ఇందూర్ వార్త / సెప్టెంబర్ 18 / కోటగిరి. పోతంగల్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ను హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… పోతంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం ఇది 83వ బ్రాంచ్ అని అన్నారు.ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. వ్యాపారం టెక్నీకల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్,ఇవ్వడం జరుగుతుందని అన్నారు .కస్టమర్లకు సర్వీస్ ఇవ్వడంలో చాలా అవార్డులు వచ్చాయని అన్నారు. త్వరలో ఏటీఎం ప్రారంభం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ మేనేజర్ రాజ్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ చౌహన్,బ్యాంకు మేనేజర్ అరవింద్, రమేష్ సెట్, గంధపు పవన్, శంకర్ పటేల్,మరియు కస్టమర్లు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.

Read More

ఇందూర్ వార్త / సెప్టెంబర్ 18 / కోటగిరి/ పోతంగల్. కోటగిరి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.కోటగిరి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.ధాన్యం దళారులకు తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు. ఎకరానికి 500 రూపాయలు బోనస్ గా ఇస్తుందని సూచించారు. వారంలోగా రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు,సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, ఏఓ శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More

అధికారుల పర్యవేక్షణ కరువైన సఖి కేంద్రం అధికారుల అండతోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా నిర్వాహకులు ఇందూర్ వార్త : కామారెడ్డి జిల్లా ప్రతినిది, అక్టోబరు 05 కామారెడ్డి, ఆపదలో ఉన్న మహిళలను అన్నివిధాలా ఆదుకొని, గృహహింస వేధింపులు, దాడులకు గురైన మహిళలకు తక్షణ వైద్య సదుపాయంతో పాటు న్యాయ, ఆర్థిక సాయం అందించే దిశగా సఖి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో కొనసాగే ఈ సఖి కేంద్రాలను తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రారంభించింది. నాటి నుండి కొన్ని ప్రభుత్వ ఆధీనంలో నడువగ మరికొన్ని ఎన్జీఓల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సఖినిర్వహణ కొనసాగుతుంది. కామారెడ్డి సఖి సెంటర్ ఏప్రిల్ 2019 న ప్రారంభించారు. ప్రారంభంలో సఖి నిర్వహణ అంత ప్రైవేట్ ఎన్జీఓ చేతిలోనే ఉండి అద్దె భవనంలో నిర్వహించేవారు. గతంలోనూ సఖికేంద్రంలో పలు అక్రమాలు జరిగి, అప్పటి డీడబ్లుఓ సైతం పలు విమర్శలు ఎదుర్కొన్నారు. సెప్టెంబర్…

Read More

వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌న్న కేటీఆర్‌ 20 ల‌క్ష‌ల మందికి రుణ‌మాఫీ కాలేదని మంత్రి తుమ్మ‌ల ప్ర‌క‌ట‌న‌ దీనిపై ఎక్స్ వేదిక‌గా స్పందించిన కేటీఆర్ రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 20 ల‌క్ష‌ల మందికి రుణ‌మాఫీ కాలేదని చెప్ప‌డంతో ముఖ్య‌మంత్రి బండారం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు. ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ఈ మేర‌కు పోస్ట్ చేశారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయింది. ఓ వైపు డిసెంబ‌ర్ 9న ఏక కాలంలో రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేసి.. మరోవైపు 10 నెల‌లైనా 20 ల‌క్ష‌ల మందికి అందించ‌కుండా ద‌గా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ పూర్త‌యిపోయింద‌న్న సీఎం మాట‌లు ప‌చ్చి అబ‌ద్ధాలు అని విమ‌ర్శించారు. చేస్తామ‌న్న…

Read More

గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం నాచారం గ్రామంలో ఉపాధి హామీ పనులు ఎంపిక మరియు గుర్తింపు తదితర సిద్దిపేట వర్గల్ అక్టోబర్ 2 ఇందూర్ వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలోగాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం నాచారం గ్రామంలో ఉపాధి హామీ పనులు ఎంపిక మరియు గుర్తింపు తదితర నాచారం గ్రామం నుంచి అభివృద్ధి కోసం పాటుపడుదామని రామస్థాయి గ్రామసభలో గత 24 నుండి 25 సంవత్సరం వరకు సంవత్సరానికి గ్రామ అభివృద్ధి ప్రణాళిక గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ సెక్రెటరీ టి కృష్ణ మాట్లాడుతూ అందరు సమానంగా పని చేయాలని చెప్పి గ్రామస్తుల సమక్షంలో కోరడమైనది ఈ కార్యక్రమంలో టి కృష్ణ పంచాయతీ సెక్రెటరీ అధ్యక్షతన వహించిన కొన్ని ని నియామకాలం పాటించవలసిందిగా గ్రామస్తులు కోరడమైనది ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన…

Read More

స్వాతంత్రతోద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో గొప్పది ఇందూర్ వార్త : వెబ్ డిస్క్ సత్యము అహింస అనేవి గాంధీ ఆయుధాలు మహాత్ముని బాటలో పయనించాలి సూర్యాపేట జిల్లా రియల్ ఏస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు  పంతంగి వీరస్వామి గౌడ్ (సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ) బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుండి తరిమికొట్టడానికి జరిగిన స్వాతంత్రోద్యమ పోరాటంలో మహాత్మా గాంధీజీ పాత్ర ఎంతో గొప్పదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. బుధవారం మహాత్మా గాంధీ 155 వ ,జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ…

Read More

పూణెలో కుప్పకూలిన హెలికాప్టర్.. అక్కడిక్కడే ముగ్గురు దుర్మరణం ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ ,అక్టోబర్ 02 ఇందూర్ వార్త  , హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్ర లోని పూణె జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది. ఈ క్రమంలో చాపర్ బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే సరిగ్గా ఉదయం 6.45కు కుప్పకూలింది. అనంతరంలో హెలికాప్టర్‌లో భారీగా మంటలు చెలరేగడంతో పైలెట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే, అది ప్రభుత్వ హెలికాప్టరా లేక ప్రైవేటుదా అనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న హింజేవాడి పోలీస్‌ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో…

Read More