ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
టిపిసిసి రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లో NSUI నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు చర్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ ని రావణ్ గా చిత్రీకరించి మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం లాంటి వివాదాస్పద అంశాలకు తెరలేపి , బీజేపీ దొంగ ఐటీ సెల్ ద్వారా శ్రీ రాహుల్ గాంధీ పైన అసత్య ప్రచారం చేస్తున్న దానికి నిరసన గా నర్సాపూర్ చౌరస్తా లో ప్రధాన మంత్రి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి NSUI నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు చార్ల ఆంజనేయులు మాట్లాడుతూ భారత్ జొడో యాత్ర ద్వారా పేద మధ్య తరగతి ప్రజలను ఏకం చేస్తూ , రాహుల్ గాంధీ ప్రజల నుండి వస్తున్న ఆదరణ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ మీద అసత్య ప్రచారాలు చేస్తన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మనుకొక పోతే కాంగ్రెస్ పార్టీ మరియు NSUI నుండి భారీ నిరసనలు ఎదురుకోవల్సి వస్తుంది అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NSUI ముఖ్యనాయకులు నవీన్ కుమార్ నర్సాపూర్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, శివంపెట్ మండల అధ్యక్షులు ప్రశాంత్ , వెల్దుర్తి మండల అధ్యక్షులు వినోద్ నాయక్, శ్రీకాంత్, అర్జున్, ప్రసాద్ ,చింటు యాదవ్ ,పవన్ కుమార్, గణేష్, మల్లేష్,మోహన్ నాయక్ తదిరులు పాల్గొన్నారు