ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
అంగన్వాడి ఉద్యోగుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడి ఉద్యోగుల చలో కలెక్టరేట్ విజయవంతం.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు J.మల్లికార్జున్* అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ గారు మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి గ్రావిటీ చెల్లించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు ఈఎస్ఐ పెన్షన్ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలన్నారు. పి ఆర్ సి ఏరియర్స్ 2021 జులై అక్టోబర్ నవంబర్ మూడు నెలల వెంటనే చెల్లించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు ఇచ్చే డబ్బులు 250 నుండి 2000 వరకు పెంచాలని ఆయన అన్నారు. ఉద్యోగులకు మట్టి ఖర్చులు 50 వేలు చెల్లించాలన్నారు. ఆరోగ్యలక్ష్మి, మెనూ చార్జీలు పిల్లలకు1.15 పైసలు నుండి 05 రూపాయల వరకు గర్భిణీ బాలింతలకు 2 . 40 పైసల నుండి 10 రూ. వరకు పెంచాలన్నారు. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలన్నారు. సెంటర్లకు మెయిన్ సెంటర్ లుగా గుర్తిస్తూ ప్రకటించి, సరుకులను వెంటనే జారీ చేయాలన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్లకు 5 లక్షలు వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించి, చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి, బలోపేతం చేసి, పక్క భవనాలు మౌలిక వసతులు కల్పించాలన్నారు. 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడి టీచర్లకు పని 15 00/-లు, హెల్పర్లకు 750/-లు, మినీ వర్కర్లకు 1250/-లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏరియాస్ సహా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేసి, ఐటీడీఎస్ కు సంబంధం లేని పనులను చేయించకూడదన్నారు. మన రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అంగన్వాడి వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారన్నారు, కానీ టీచర్లతో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఒక లక్ష, హెల్పర్లకు, మినీ హెల్పర్లకు 50,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు. బెనిఫిట్స్ అతి తక్కువ నిర్ణయించడం, వేతనాల పెంపు తదితర సమస్యల పైన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదన్నారు. దీంతో అంగన్వాడి ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న సమయంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, అంగన్వాడి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత 45 సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవ అందిస్తున్న ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం లేదని ఆయన ప్రభుత్వం పై మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ కేరళ అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్, బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రా డ్యూటీ చెల్లిస్తున్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి B. బసవరాజ్, జిల్లా అధ్యక్షులు A.మహేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు A. మల్లేశం, K. నాగరాజు, బాలమణి, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ, నాయకులు రాజ్యలక్ష్మి, మంజుల, విజయలక్ష్మి, విజయమ్మ, మంజుల,జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు.