ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి,
1)పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి.
2)పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్
చెక్కులు పంపిణీ చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ టౌన్ ఎన్. జీ.ఓ.ఎస్ కాలనీ కి చెందిన చౌటి సాయి కిరణ్ గారికి మంజూరైన
₹ 1,00,000/- ఒక లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును 8 వ వార్డ్ కౌన్సిలర్ పంబాల రాంచందర్ కి అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.