బిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
ఇందూర్ వార్త : కామారెడ్డి (వెబ్ న్యూస్)
పదవరోజు నిరసన కార్యక్రమంలో భిక్షాటన చేస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నటువంటి సౌకర్యాలు కాంటాక్ట్ ఉద్యోగి లేవు 18 సంవత్సరాల నుంచి కాంటాక్ట్ ఉద్యోగుల పని చేస్తూ కనీసం ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా హెల్త్ కార్డ్స్, హెచ్ఆర్ఏ, డిఏ ఉద్యోగి విధులు నిర్వహిస్తూ ప్రమాదవశత్తు మరణించిన ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. తెలంగాణలో వివిధ శాఖలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. విద్యారంగంలోనూ పేద విద్యార్థులకు సేవలందిస్తున్న మమ్మల్ని మరిచిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము సైతము కూడా ఉద్యమించమని గుర్తు చేశారు. తక్షణమే సీఎం గారు స్పందించాలని ఆవదనే వ్యక్తం చేశారు. మా నియామకం రోస్టర్ కం మెరిట్ ఇంటర్వ్యూ అండ్ ఎక్సమ్ తో జరిగినది. న్యాయమైన డిమాండ్లు సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యురేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు దామోదర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రతినిధులు శ్రీధర్ కుమార్,భాను ,రోబో శీను,వీణ ,సంపత్ ,రాములు, శైలజ ,శ్రావణ్ ,కాళిదాస్, సంజీవులు,సంధ్య, 500 మంది పాల్గొన్నారు