కరీంనగర్ జిల్లా: ప్రతినిధి
కరీంనగర్ జిల్లా :జులై 25
జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా భయంతో నిద్రలేక జాగారం చేశారు. ఇంట్లో వంట సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఇల్లుతో పాటు సమాను అంతా ధ్వంసమైందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు..