*మహబూబాబాద్ జిల్లా లో స్కూల్ వ్యాన్ బోల్తా*
మహబూబాబాద్:ప్రతినిధి
మహబూబాబాద్:జులై 24
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడగా విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను చుట్టు పక్కల గ్రామాల్లోని తమ తమ ఇండ్లకు పంపించేందుకు పిల్లలను బస్సులో ఎక్కించుకొని మండల కేంద్రంలోని,బైపాస్ రోడ్డు లో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ, బస్సు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు, స్కూల్ బస్సును డ్రైవరు అజాగ్రత్తగా నడపడం వల్ల అదుపు తప్పి పక్కన ఉన్న కాలువలో బోల్తా పడింది.
దింతో డ్రైవర్ పారిపోగా, బస్సులో ఉన్న విద్యార్థులను అక్కడే ఉన్న స్థానికులు, హమాలీలు విద్యార్థులను బయటకు తీశారు. ఈ సంఘటనలో45 మంది విద్యార్థులు ఉండగా కొంత మంది విద్యార్థులకు స్వల్ప గాయలతో బయట పడ్డారు. కాగా ఈ పాఠశాల పేరుతో స్కూలు వ్యానుకు అనుమతి లేకపోవడం గమనార్హం…..