*టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి,ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తగా అంజల్ రెడ్డి నియామకం..*
*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు..*
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన బొండ్ల అంజల్ రెడ్డిని టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించినట్లు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలియజేశారు.
నూతన నియామకమైన టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్త అంజల్ రెడ్డి మాట్లాడుతూ టిఎన్ఎస్ఎఫ్ కమిటీల బలోపేతానికి ఐపీఎల్ కృషి చేస్తానని,బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.