*గిరిజన బంధుకు బడ్జెట్ కేటాయించకుండా గిరిజనులకు మోసం*
*-మోహన్ నాయక్ ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్షుడు…*
ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 12
కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి మండలం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 కేటాయించిన బడ్జెట్లో గిరిజన బంధుకు బడ్జెట్ కేటాయించకుండా గిరిజనులను మోసం చేశారని గిరిజన శక్తి ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు మోహన్ నాయక్ అన్నారు. ఇప్పటి వరకు డబ్బుల్ బెడ్రూం ఎవ్వలేదని మండిపడ్డారు. ఎస్టీలలో ఇతర కులాలను చేరిస్తే సహించేది లేదని, స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల అవుతున్న కూడా గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఇప్పటికి గిరిజన తండాల్లో రోడ్ల వసతులు లేవన్నారు.