సంగమేశ్వర్ గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి క్యాలెండర్లను ఆవిష్కరించిన జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు
ఇందూరు వార్త
దోమకొండ ఫిబ్రవరి 12
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆదివారం రోజున కురుమ యువ చైతన్య సమితి క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కేవైసీఎస్ కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు మాట్లాడుతూ మరి కురుమ యువతి యువకులు వెనుకబడిపోతున్నారని వారు తెలిపారు.ఎందుకంటే చదువుకునే వయసులో గొర్లను మేపటానికి వెళ్లడం వలన విద్యార్థిని విద్యార్థులు చదువులో వెనుక పడుతున్నారు. కురుమ యొక్క కూతురు కుమారులు వెనక పడకూడదు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని గొర్లను మేపడానికి పనికి పంపించకుండా చదువును ప్రోత్సహించి స్కూల్లోకి కాలేజీకి పంపిస్తే వారు మంచి పై స్థాయికి వచ్చి ఉద్యోగులు చేసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అన్నారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మేకల్ని పంపిణీ చేస్తున్న మాట నిలబెట్టుకోవాలని వారు తెలిపారు.అనంతరం దోమకొండ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ అదే విధంగా దోమకొండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు మాట్లాడుతూ మరి ఏదైతే కేసీఆర్ హామీ ఇచ్చిన మాట ఈ యొక్క రెండో విడత లో భాగంగా గొర్రెలను మరో రెండు నెలల్లో పంపిణీ చేస్తామని వారు తెలిపారు.ఎవరైతే డిడి కట్టుకున్న వారు ఉంటారో వారికి తప్పనిసరిగా గోర్లను పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సంగమేశ్వర్ సర్పంచ్ నరేష్, కురుమ సంఘం అధ్యక్షులు కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి బుయ్య శ్రీకాంత్, కామరెడ్డి జిల్లా అధ్యక్షులు చెట్టుకూరి రజినీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి సంజీవ్, జిల్లా కోఆర్డినేటర్ అంబాల సాయి నిఖిల్, జిల్లా కార్యదర్శి పుల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు