*కవితకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఎందుకిచ్చావ్ కేసీఆర్*
ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన.. నాతో పాటు నీ బిడ్డ కవిత కూడా ఎన్నికల్లో ఒడిపోయింది.. నాకు బి ఫార్మ్ ఇవ్వకుండా నీ బిడ్డకు మాత్రం రెండుసార్లు ఎమ్మెల్సి ఎందుకిచ్చావ్ కేసీఆర్ అని ప్రశ్నించారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఏమైనా మేము పిచ్చోళ్ళమా అని నిలదీశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారానికి చెక్ పెట్టారు. టిఆర్ఎస్(బీఆర్ఎస్) లో తనను నమ్ముకున్న కార్యకర్తలకు సభ్యత్వం ఇచ్చేందుకు సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా తనను అవమానించారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, తాను ప్రస్తుతం కసిమీద ఉన్నామని, కేసీఆర్ ను బొందపెట్టి తీరుతామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు