మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాల తనిఖీ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఇందూర్ వార్త
బీర్కూర్ 24 డిసెంబర్
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతీభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (MJPTBCWREIS), (BC రెసిడెన్షియల్ స్కూల్ -బాలుర) ను ఈరోజు సాయంత్రం భోజన సమయంలో అకస్మీకంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి
గారు.
వండిన ఆహార పదార్థాలను పరిశీలించిన స్పీకర్ పోచారం గారు.
మేను ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వంటలలో వాడి నాణ్యమైన, రుచికరమైన భోజనం వండారా అని వార్డెన్, సిబ్బందిని ప్రశ్నించిన పోచారం గారు.
అన్నం, కూరలు రుచిగా ఉన్నాయా, సరిపోయేంత పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న స్పీకర్ పోచారం గారు.
నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారాన్ని వండాలి. మేను ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని స్పీకర్ పోచారం గారు వార్డెన్, సిబ్బందికి సూచించారు.
లేకపోతే చర్యలు తీసుకుంటాను.
నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ భవనం త్వరలోనే పూర్తవుతుంది, తదుపరి ఇక్కడి నుండి తరలిస్తాం.