గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్
ఇందూర్ వార్త
బాన్సువాడ రూరల్ : డిసెంబర్ 23
తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు వరంగా మారనున్నాయని హన్మజిపేట్ గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని హాన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయానికి నిదర్శనం అన్నారు. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవప్తమైన పథకానికి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలో గర్భిణీలు ఆరోగ్యకరంగా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించడం చారిత్రక ఘట్టమన్నారు. ఇందులో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం హిమోగ్లోబిన్ శాతం పెంచడమే న్యూట్రిషన్ కిట్ల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకురాలు విజయలక్ష్మి, , ఉప సర్పంచ్ అక్బర్, ఆస్పత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.