వివాహ వేడుకలో పాల్గొన్న శాసనసభ ప్రతి
ఇందూరు వార్త
బీర్కూర్ 18 డిసెంబర్
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద గల కల్యాణ మండపం లో బీర్కూర్ మండల brs పార్టీ అధ్యక్షులు శ్రీ లాడేగాం వీరేశం కుమారుడు శ్రీ వంశీ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. నవ వధువులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీర్కూరు మండలం రైతుబంధు అద్యక్షులు ద్రోణవల్లి అశోక్, రైతుబంధు గ్రామ అధ్యక్షులు అవారి గంగారం, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.