రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృత
ఇందూరు వార్త
ములుగు జిల్లా తాడ్వాయి
ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో,తాడ్వాయి మండలం కోడిశెల గ్రామానికి చెందిన మొగిలిపల్లి కృష్ణ- పద్మ దంపతులు అంకంపల్లి లో తమ బంధువులకు రాఖీ కట్టి వస్తున్నారు. నాంపల్లి నీళ్ల ఒరే సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. తాడ్వాయి.ఎస్ ఐ. శ్రీకాంత్ రెడ్డి పంచనామ నిర్వహించి పోస్టుమార్టంకు ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు.