అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:తూర్పు నియోజకవర్గం బి ఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు సింగిరెడ్డి యశోద ఇందూరు వార్త, వరంగల్ డిసెంబర్ 20:. అమిత్ షా ను అరెస్ట్ చేసి బర్తరఫ్ చేయాలి లేదంటే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అమిత్ షా కేంద్ర హోం మంత్రి పదవిని అనుభవిస్తున్నారు
అంబేద్కర్ గారు భారత రాజ్యగం ద్వారా పెట్టిన భిక్షతోనే మంత్రి పదవులు అనుభవిస్తూ అంబేద్కర్ గారిని అవమానించడం ఆయన ఆత్మ సాక్షిగా చేసిన ద్రోహమే
సాక్షాత్తు రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం రాజ్యాంగ విరుద్ధమే
నిరీక్షణ నిరక్షరాశులకు కూడా అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత అని సుపరిచితమే కానీ కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉండి అంబేద్కర్ గారిని అనాలోచితంగా అర్థరహిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా పై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలి
అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి
దళితుల ఐకాన్ అంబేద్కర్ గారిపై ప్రధాని నరేంద్రమోడీకి విశ్వాసం ఉంటే అమిత్ షాని మంత్రి వర్గం నుంచి తొలగించాలి
అమిత్ షా వెంటనే భారత దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని సింగిరెడ్డి యశోద డిమాండ్ చేశారు