జూలూరుపాడు మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించాలి
ఇండూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16
తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కిడ్నీ సమస్యకి అధికంగా ప్రజలు గురవుతున్నారు అని,ఇటీవల ఒక మహిళ కిడ్నీ సమస్యకి మృతి చెందడం జరిగిందని,కచ్చితంగా జూలూరుపాడు మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించాలి,మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,అలాగే కిడ్నీ సమస్య బారిన పడిన బాధితులను గుర్తించి కార్పొరేటు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించాలని మరియు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు మండల పరిధిలో నీరు (వాటర్ ) నీ ల్యాబ్ లకి పంపించి పరీక్ష చెప్పించాలని,బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలనీ,ప్రజలు కిడ్నీ సమస్య భారీ పడకుండా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనీ తుడం దెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.