టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు
వెల్దుర్తి డిసెంబర్ 9 ఇందుర్ వార్త ప్రతినిధి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం బహుమతులు ప్రధానం చేశారు. మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో జగ్గా శ్రీ చరణ్, హనుమాద్రి చంద్ర వర్ధన్ గౌడ్, తెలుగు మీడియం విభాగంలో వై శ్రీజ, పి దుర్గా ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారికి ఎంఈఓ యాదగిరి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి సూర్యకుమార్, కోశాధికారి శైలజ, మండలంలోని వివిధ పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు