విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
ఆఫీసర్స్ బీ అలర్ట్…!
ఇందూర్ వార్త నవంబర్ 28 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
– కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ …!
– పలు శాఖల అధికారుల పనితీరు పై ఫిర్యాదులొస్తున్నాయ్
– పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక
– సీఎస్ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలి
– పంచాయతీ సెక్రటరీలపై డీపీవో, ఎమ్మార్వోలపై ఆర్డీవో పర్యవేక్షణ తప్పనిసరి
– అన్ని శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్ సమన్వయం చేసుకోవాలి
– కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం
కొత్తగూడెం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన అప్పటికప్పుడు పలు శాఖల అధికారులతో చుంచుపల్లిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయన్నారు