విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి….
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి….
ఇందూరు వార్త హనుమకొండ జిల్లా ఆత్మకూరునవంబర్ 26
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రము లోని సెయింట్ థెరిస్సా హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం లో ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దిన ఘనత సెయింట్ థెరిస్సా హై స్కూల్ కి ఉందని అన్నారు.విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలి అన్నారు. స్కూల్ అభివృద్ధికి సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.ప్రొవిజనల్ మదర్ యానిస్ , ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్,ఉపాధ్యాయులు,అధికారులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.