పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి
రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా , ఇందూర్ వార్త నవంబర్26.కిట్టు రిపోర్టర్
నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ అందోల్ నియోజకవర్గంలో పర్యటించి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు
పుల్కల్ మండలం లోని కోడూరు X రోడ్డు నుండి కొండారెడ్డిపల్లి X రోడ్డు వయా బొమ్మారెడ్డిగూడెం నిర్మాణానికి
4.69 కోట్ల నిధులతో
కోడూరు X రోడ్డు వద్ద శంకుస్థాపనచేసి 11.45 గంటలకు
డాకూర్ PWD రోడ్డు నుండి పోతిరెడ్డిపల్లి X రోడ్డు (వయా మాసాంపల్లి) వరకు
2.38 కోట్లతో
శంకుస్థాపన చేస్తారు 12.45 గంటలకు రోళ్లపహాడ్ గేట్ నుండి రోళ్లపహాడ్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి
1.40 కోట్లతో రోళ్లపహాడ్ గేటు వద్ద శంకుస్థాపన చేసి అనంతరం కార్యకర్తలతో సమావేశం చేయనున్నారు.