ఇళ్ల స్థలాల కోసం 9 రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి పేదలకు మద్దతుగా నిలిచిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి
ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంటపల్లి గ్రామం సమీపము వద్ద ఇళ్ల స్థలాలు కావాలని తొమ్మిదో రోజు ధర్నా చేస్తున్నటువంటి నిరుపేదలు కు మద్దతు తెలిపిన ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల నుంచి ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేస్తున్న అధికారులకు పట్టింపు లేదని,తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని,ప్రభుత్వాలు మారుతున్న కూడా పేదల బ్రతుకులు మారడం లేదని, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని,ఇల్లు కావాలని రోడ్డు ఎక్కితే కేసులు బనాయిస్తున్నారని,ధర్నా చేస్తున్న ఆదివాసీల వాహనాలు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని,పెట్టిన కేసులు కూడా వెనకకు తీసుకోవాలని,ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.