కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఇందూరు వార్త నవంబర్ 21 ఖమ్మం జిల్లా ప్రతినిధి
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది ఎవరు!!??
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
కొత్తగూడెం: కొత్తగూడెం మధుర బస్తి 30 వ వార్డు నందు అనుమతులకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలను ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.గురువారం పార్టీ కార్యాలయంలో జన కళ్యాణ్ దివస్ కొరకు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సామాన్యులకు ఒక చట్టం డబ్బున్న బడా బాబులకు ఒక చట్టంలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.అసలు బస్టాండ్ వద్ద గల అక్రమ నిర్మాణంపై 6 నెలల నుండి బీఎస్పీ మున్సిపల్ కమిషనర్ మొదలు ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సదరు బిల్డింగ్ పై ఇప్పటివరకు కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ లో తొమ్మిది సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని అసలు అధికారులను చర్యలు తీసుకొనకుండా అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరు అని ప్రశ్నించారు?? రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నవారు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకొనకుండా అధికారులను ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణంపై మున్సిపల్ వారు బిల్డింగ్ యజమానికి నోటీసు జారీ చేయగా బిల్డింగ్ యజమాని హైకోర్టుకు వెళ్లగా అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 7వ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,ఇల్లందు అసెంబ్లీ అధ్యక్షులు అజ్మీర వెంకన్న,పోలే కనకరాజు,గూగులోత్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు