ఘనంగా జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం
ఇందూరు వార్త నవంబర్ 8 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
వ్యవసాయం కళాశాల, అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం- ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆయిల్ ఫెడ్, మేనేజింగ్ డైరెక్టర్ . టి. సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవను ఒక బాధ్యతగా విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలి అన్నారు. వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ రంగంలోని నూతన సాంకేతిక పద్ధతులపై తగిన అవగాహన కలిగి ఉండి, రైతుల అభ్యుదయానికి కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ రైతుల అభివృద్ధికి, ఆయిల్ దిగుబడి పెంపదించడానికి ఆయిల్ పెడ్ చేస్తున్న కృషిని రైతులకు మరియు విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆయిల్ షెడ్ డి ఈ శ్రీ బాలకృష్ణ మాట్లాడుతూ రైతులు అధిక నికర లాభాలు పొందటానికి ఆయిల్ ఫామ్ ఎంతగానో దోహదపడుతుంది. ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంచే దిశగా ఆయిల్ ఫెడ్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గురించి వివరించారు.
అనంతరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఈ వారం రోజులపాటు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా, విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలకు గాను, వారిని అభినందించారు. ఇకముందు కూడా విద్యార్థులు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి అన్నారు.
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మల్లారం గ్రామ ప్రజలకు, పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు డాక్టర్ ఎం రాంప్రసాద్, డాక్టర్ పి రెడ్డి ప్రియ, డాక్టర్ టి శ్రావణ్ కుమార్ తో పాటు శాస్త్రవేత్త కే. కోటేశ్వర్, మల్లారం గ్రామ రైతులు మరియు వ్యవసాయ