కబడ్డీ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
ఇందూ ర్ వార్త వెబ్: ఖమ్మం జిల్లా ప్రతినిధి
జిల్లా కబడ్డీ అసోసియేషన్ మరియు పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను 28,29,30 వ తారీఖులలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరుదయాకర్ రెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అశ్వారావుపేట శాసనసభ్యులు
జారె ఆదినారాయణ వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ఇ ల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ ప్రసన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అసోసియేషన్ ప్రముఖులు ప్రజాప్రతినిధులు క్రీడా నిపుణుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించి క్రీడాకారులు క్రీడాభిమానుల ప్రశంసలు పొందినందుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులను అసోసియేషన్ అధ్యక్షులుజారె ఆదినారాయణని అభినందించారు..