విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి….భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం.వెంకట్రావు
ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐ టి స సారపాక సౌజన్యం తో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యాను అభ్యాసిస్తున్నా విద్యార్ధిని,విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ& ఓరియంటేషన్ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జాన్ మిల్టన్ అధ్యక్షతన జరిగిన సమావేశం కి ముఖ్య అతిథి గా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరు అయి విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం డిగ్రీ కళాశాలలో చదువుతున్నా విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి పేరు-ప్రఖ్యాతలు తీసుకొని రావాలి ఆకాంక్షించారు. కళాశాల కి అవసరం అయిన మౌలిక సౌకర్యాలు కల్పనకు క్రుషి చేస్తాను అన్నారు…ఈ కార్యక్రమం లో హెచ్ ఆర్ చీఫ్ మేనేజర్ ఐటీసీ సారపాక చెంగల్ రావు సిపిడిసి. బుసిరెడ్డి, శంకర్ రెడ్డి,పూర్వ విద్యార్థుల అధ్యక్షులు వి.కామేశ్వరావ్ పూర్వ విద్యార్థుల కార్యదర్శి బాలయోగి గ,వైస్ ప్రిన్సిపాల్ హవివ కళాశాల ,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు