నిజమైన లబ్ధిదారులకే ఇండ్ల కేటాయింపు జరగాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
ఇందూరు వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
– “దునుకు రాము”
– టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్
రాష్ట్ర ముఖ్యమంత్రి ” రేవంత్ రెడ్డి” అదేశాలమేరకు
రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు ” పొంగులేటి శ్రీనివాసరెడ్డి” ప్రతిష్టాత్మక ఆశయంకొరకై
ఈనాటి దీపావళి కానుకగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు మంజూరు చేయబోతున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు…ప్రజాసేవకులు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అర్హులైన… నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ “దునుకు రాము” సగౌరవ విజ్ఞప్తి చేశారు
“ఓ పక్క ఇందిరమ్మ కమిటీలు”
*మరోపక్క స్థానిక నాయకుల వర్గపోరు తో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లపధకం పక్కదారిపట్టే అవకాశం ఉన్నందున
తెరచాటున దళారులు అమాయక ప్రజలను దండుకునే వీలున్నందున సాధ్యమైనంతవరకు తమరి సారథ్యంలో తమరి సమక్షంలోనే ప్రతి ఇల్లు మంజూరుకు శ్రీకారంచుట్టాలని ఆకాంక్షిస్తున్నాం
కొన్నిచోట్ల ఇండ్లపేరుతో వసూళ్లకు పాటుపడేలా కొంతమంది తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు అక్కడక్కడా ప్రజల్లో పార్టీ కార్యకర్తల మనోభావాలలో వినపడుతున్నందున
– “మన కాంగ్రెస్ ప్రభుత్వంలో”
– “ఇందిరమ్మ రాజ్యంలో…….”
– “మీ పాలనాసారథ్యంలో….”
పార్టీలకు అతీతంగా దీపావళి సందర్భంగా నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపే నాయకుడిగా ప్రజాసేవకుడిగా నిలవాలని…..మీరే స్వయంగా కలగజేసుకొని ప్రతిఒక్కరికీ న్యాయం చేకూర్చాలని
తద్వారా పేదింటి బిడ్డల ఇంటికల సాకారమయ్యేలా, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చేందుకు మార్గం సుగమం అవుతుందని మీకు సగౌరవంగా విన్నవిస్తున్నాం…..!!
ఇట్లు
మీ…దునుకు రాము
టీపీసీసీ సోషల్ మీడియా ఇంచార్జ్
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్