తెలుగు రాష్ట్రాలకు త్వరలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
ఇందూర్ వార్త వెబ్ డెస్క్ హైద్రాబాదు:సెప్టెంబర్ 18
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ట్రైనీ ఐపీఎస్ లను కేటాయించింది.మొత్తం ఎనిమిది మంది ఐపిఎస్ లను ఈ రెండు రాష్ట్రాలకు పంపనుంది. ఏపీకి దీక్ష (హరియాణా) బొడ్డు హేమంత్ AP, మనీశా వంగల రెడ్డి, AP,సుస్మిత,(తమిళనాడు) ను కేటాయించింది..ఇక తెలంగాణకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్ (TG), రుత్విక్ సాయి కొట్టే,(TG), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్)ను కేటాయించింది..ఇక ఈ కొత్త ఐపిఎస్ లు ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పొలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ పేరేడ్ లో పాల్గొనను న్నారు.. అనంతరం వారికి కేటాయించిన రాష్ట్రాలలో బాధ్యతలు స్వీకరిస్తారు..