హై “డ్రామా నా..?” లేక హైడ్రా నిజమేనా?
హైడ్రా ముందుకా? వెనకకా?
బిల్దర్లకు కట్టిన డబ్బుకు ఎవరు జవాబుదారీ అవుతారు? బిల్డరా? లేక హైడ్రానా?
ఇందూర్ వార్త: వెబ్ డెస్క్
భాగ్యనగరం లో ఉన్న చెరువులు కుంటలు కబ్జాలకు గురి అవుతున్న బఫర్‌జోన్ లలో భవనాలు నిర్మించినవి నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని కూల్చివేయడం తెలంగాణ ప్రజలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలోని ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా హైదరాబాద్ లోని “హైడ్రా” చర్యలు మనం గమనించవచ్చు కానీ హైడ్రా యొక్క కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ నెల 7 వ తేదీన మీడియాతో ఒక విషయాన్ని తేటతెల్లమ్ చేశారు. అదేమిటంటే ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాలను కూల్చేది లేదని కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు గురికావొద్దని భయపడాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. ఇది బాగానే ఉంది కానీ బిల్డర్లు ఈ మధ్యకాలంలో వారి యొక్క తెలివితేటలు మితిమీరిపోయి భూమిని చదును చేసే సమయంలో నుండే అడ్వాన్సులను కొనుగోలుదారుల నుండి అనేక రాయతీలను ప్రకటించి బుట్టలో వేసుకుంటున్నారు మరి అలా కట్టిన డబ్బుకు ఎవరు జవాబుదారీ అవుతారు? బిల్డరా? లేక హైడ్రానా? అలా కాకపోతే లంచాలు తీసుకొని ఎఫ్టిఎల్ , బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన అధికారులా? దీనికి సమాధానం కావాలి మొన్నటి వరకు అన్నింటినీ కూల్చడం తప్పదు అని ఇప్పుడు స్వరం ఎందుకు మార్చినట్లు ఆనే విషయం రంగనాథ్ కి మాత్రమే తెలియాలి. బడా బాబులు కొందరు విద్యాసంస్థల పేరుతో కొంతమంది వ్యాపార సంస్థల పేరుతోనో పేరు ఏదైనా కానీ ఎఫ్. . ఎల్ బఫర్ జోన్లలో పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టిన వారు కోర్టులకు వెళ్లి కాకమ్మ కథలు చెప్పి “స్టె”
తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది నిజాయితీగా కష్టపడి చెమటోడ్చి డబ్బులు పోగు చేసి ఇల్లు కొనుగోలు చేసిన వారివి కూల్చినట్లు మీడియా ముందు వారి అర్థనాదాలు చూసిన తరుణంలోనా తెలియదు కానీ ఆయన స్వరంలో మార్పు మాత్రం కనిపిస్తుంది అయితే ఇన్ని సంవత్సరాలలో గడిచిన పది సంవత్సరాలు కాలంలో బిఆర్ఎస్ పరిపాలన చేసిన సమయంలో అప్పటి ఐ టి మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన వారికి గాని లేక మాజీ ముఖ్యమంత్రి గారికి కాని తెలియకుండానే ఈ ఆక్రమణలు జరిగాయా? అంతకుముందు అధికారంలోనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులదా? లేక అప్పటి మంత్రివర్గం మొత్తాన్నిదా? కారణం ఏదైనా చెరువులు కుంటల యొక్క ఎఫ్ .టి.ఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు మాత్రం దినదినం మూడు పువ్వులు ఆరు కాయలుగా హైదరాబాదుతో పాటు జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాలు అని తేడా లేకుండా ప్రతిచోట ఆక్రమించుకుంటూ పోయారు దాని పర్యావసానమే గతంలో మనం అనుభవించినా! ఇప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ విపత్కర పరిస్థితులకు కారణంగా చెప్పవచ్చు కానీ హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశారు బాగానే ఉంది దీనికంటే ముందుగా మన రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఎన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి అయ్యాయి. వాటి యొక్క ఎఫ్ .టి.ఎల్ బఫర్ జోన్స్ యొక్క పరిధి ఎంత అనేది ముందు నిర్ధారణకు రాకుండా కొన్నింటిలో కూల్చివేతలకు పాల్పడిన తర్వాత చెరువులన్నింటి యొక్క ఎఫ్.టి.ఎల్,బఫర్‌జోన్ , ఎక్కడ వరకు ఉన్నాయో ఇంకా నిర్ధారణకు రాలేదని స్వయానా హైడ్రా కమిషనర్ గారు అయిన ఏ.వి.రంగనాథ్ గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది ఇదంతా చూస్తుంటే హైదరాబాదులోని ప్రజలు మరియు ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలు ఇంతకుముందు నుండి హైదరాబాదును ఎలాగైనా కాపాడుకోవాలి అనే కాంక్షతో శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులను, అభ్యర్థించారు కానీ పట్టించుకున్న నాధుడే లేక ఈరోజు ఈ విధంగా హైదరాబాదు నగరం తో పాటు ఖమ్మం ,వరంగల్ లాంటి అన్ని జిల్లా కేంద్రాలు ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి వస్తుంది అయితే హైడ్రా పనులు శరవేగంగా జరిగి వివిధ జిల్లాలు డివిజన్ కేంద్రాలకు కూడా విస్తరించి పనులు సవ్యoగా జరుగుతాయా? లేక తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ” దొంధు- దొంధే “అనే చందంగా ‘నాకింత ,నీకింత ‘అనే విధంగా వ్యవహరించి తోక ముడిచుకుంటుందా? లేక నిజంగానే ‘”హైడ్రా “అనే జీవి “విచ్చిత్తి “చెందినట్లు అన్ని ప్రాంతాలకు విస్తరించుకుంటూ ముందుకు వెళుతుందా? లేక హై’ (డ్రా)మా”గా మారిపోతుందా ?అని ఆబాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ ఆవేదన వ్యక్తం చేశారు