జర్నలిస్ట్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు
దుష్ప్రచారాన్ని ఖండించిన అఖిలపక్షం నాయకులు
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అఖిలపక్షం నాయకులు తెలిపారు. హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ సమీపంలోని
బి.ఎన్.రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శనివారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన హత్నూరలో గురువారం అధికారికంగా నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన అంశంపై ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్ ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతమైన విమర్శలకు దిగడం బిఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షుడు శివశంకరరావుకు తగదని హెచ్చరించారు. జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు, తానేమిటో తెలుసుకోవాలన్నారు. జర్నలిస్టుపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని శివశంకర్ రావును హెచ్చరించారు. సొంత గ్రామంలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను మనసులో పెట్టుకొని వ్యక్తిగతంగా జర్నలిస్టు పరువు తీసేందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ దానిని బిఆర్ఎస్ పార్టీపై రుద్దడం సరికాదని సొంత పార్టీ నాయకులు విమర్శించారు . మండలంలోని గౌడ కులస్తులకు వెన్నంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారే తప్ప ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని గౌడ సంఘం నాయకులు తెలిపారు.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుపై నిరాధారమైన నిందలు వేయడం ,మిగతా విలేకరులను కూడా పరోక్షంగా బెదిరింపులకు గురి చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో. అఖిలపక్ష నాయకులు ఎంపీటీసీల పోరం మాజీ మండల అధ్యక్షులు రాజేందర్, టిపిసిసి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి. ఎం ఏ హకీం.తాజా మాజీ సర్పంచులు. వీరస్వామి గౌడ్. బుచ్చిరెడ్డి. మాధవి నవీన్ గౌడ్.కొన్యాల సతీష్, బిజెపి మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ , నర్సాపూర్ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్,చంద్రం గౌడ్ ,రాజు, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్ ,మోద్గుల శ్రీశైలం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు.పొట్లగల్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లోల్ల.పెంటయ్య, వల్లి గారి లక్ష్మీనారాయణ.ప్రవీణ్, టైగర్ నరెందర్, తాజా మాజీ వార్డు సభ్యులు. ఆసీఫ్. మైనార్టీ నాయకులు. ఇస్మాయిల్. పొట్లగళ్ల కృష్ణ, పొట్లగళ్ల.శంకర్ యూత్ కాంగ్రెస్ నాయకులు. మధుసూదన్ గౌడ్. చెక్క బాలకృష్ణ గౌడ్. అబ్దుల్ ఖదీర్. తదితరులు ఉన్నారు.