డిప్యూటీ ఎమ్మార్వో ను అరెస్టు చేయాలి
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు
ఇందూర్ వార్త – కామారెడ్డి
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ తెద్దు ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన డిప్యూటీ ఎమ్మార్వో ను అరెస్టు చేయాలనీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దళిత ఉద్యోగిని తెద్దు ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన వెంకటేష్ పై ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేస్ నమోదు చేయాలన్నారు.
దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ తాసిల్దారుని అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, లావణ్య, మానస, రాజనర్సు, లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.