ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
సమస్త మానవాళికి శక్తి స్వరూపం శ్రీ బాగలముఖి
అమ్మ ఆశీర్వాదంతో ప్రజల కష్టాలు తొలగాలి : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలో జరిగిన శ్రీ బగళాముఖి అమ్మ వారి ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ హిందూ సోదరులు పవిత్రంగా ధ్యానించే దశ మహా విద్యాలలో బగళాముఖి ముఖ్యమైన దేవత అన్నారు. బగళాముఖి అమ్మ వారిని ఆరాధించడం ద్వారా సకల కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్ముతారని అన్నారు. అంతటి విశిష్టత కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ అమ్మవారి దయతో ప్రజల సకలకష్టాలు తొలగి ఆనందంగా వుండాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేశ్ గుప్తా, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, లక్ష్మి నరసింహా, రామ గౌడ్,దేవేందర్,శ్రీమాన్, కొండల్,వెంకటేశ్, లక్ష్మి నారాయణ, సంతోష్, ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.