ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
అభయ హస్తం గ్యారంటీ ల పథకాలకు సంబందించిన గ్రామ సభ రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.
ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ గారు వారి టీం తో వచ్చిన సందర్భంగా సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ మాట్లాడుతూ కౌడిపల్లి నుండి వెల్మకన్నే గ్రామానికి వచ్చే దారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్న విషయం గతంలో ఉన్న సర్పంచ్ వడ్ల శ్రీనివాస్ మరియు నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా వ్రాత పూర్వకంగా చాలా సార్లు ఇచ్చిన కూడా పట్టించుకోక పోవడం ఏంటని తహశీల్దార్ గారిని ప్రశ్నించారు. చాలా సార్లు మండల సర్వ సభ్య సమావేశంలో కూడా చెప్పినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని వెల్మకన్నే సర్పంచ్ ఖాజీపేట్ రాజేందర్ అన్నారు.
వెల్మకన్నే రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 444, 447 లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ప్రజల కోసం ముందు ముందు గ్రామ ప్రజలకు ఇండ్లకోసం మరియు రెసిడెన్షియల్ పాఠశాలకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనువు గా ఉండే విలువైన స్థలం గురించి ఎన్నిసార్లు పిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ తహశీల్దార్ ను ప్రశ్నించారు.
ఈ రోజు గ్రామాలకు వస్తున్న నిదులల్లో అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తుంటె ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టడం లేదని సర్పంచ్ రాజేందర్ తో పాటు బిజెపి మండల అధ్యక్షుడు రాకేష్, OBC జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్, పోలింగ్ బూత్ అధ్యక్షులు వనమాల రాజు, కూర రాజశేఖర్ నాయకులు గాండ్ల మల్లేశం, గ్రామస్తులు గ్రామ సభను అడ్డుకున్నారు.
సమయానికి కౌడిపల్లి ASI, పోలీస్ సిబ్బంది, చిలిపి చెడ్ సబ్ ఇన్స్పక్టర్ మరియు నర్సాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గార్లు నచ్చచెప్పడం తో వేదిక మీద CM, మంత్రుల ఫొటోలతో వేయించిన ఒక ఫ్లెక్సీ వేదిక ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి తో పాటు CM రేవంత్ రెడ్డి, మంత్రుల ఫోటో తో కూడిన ఫ్లెక్సీ తో గ్రామ సభ నిర్వహించడం జరిగింది