ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వారు వారి యొక్క మొక్కులను మొక్కుకున్నారు. భక్తుల మధ్య భజనలతో స్వామివారిని దర్శించుకుంటే కన్నులకు చూడనీకి కనువిందుగా ఉంది
- వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేకత ఏంటి
- మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో, మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయల్దేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు.వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార (ఉత్తరభాగం) శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తరద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. లియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం.