ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు..!
*ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు*
*9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశo*
ఇందూర్ వార్త : హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఎమ్మెల్సీ కవితకు తలనొప్పిగా తయారైంది. తాజాగా బుధవారం ఉదయం ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి నట్లు సమాచారం. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గోరంట్ల బుచ్చిబాబు,అరుణ్ రామచంద్రయ్య పిళ్ళై వాంగ్మూలం ఆధారంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.