79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
ఆర్మూర్, నమస్తే ఇందూర్ ఆగస్టు 15,
ఈరోజు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మూర్లోనూ మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రాజు మరియు కౌన్సిలర్ ఖందేశ్ సంగీత మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పండిత్ పవన్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బి ఆర్ ఎస్ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి, బి ఆర్ ఎస్ ఆర్మూర్ పట్టణం ఇన్చార్జి పూజ నరేందర్ తదితరులు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, ఉపాధ్యక్షుడు గంగా మోహన్ మరియు ఎస్ ఎస్ కే సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్ ఎస్ కె యూత్ సభ్యులు గుండం పైన స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.