ప్రజల ఆశీర్వాదం తో కోలుకున్నా…. ఏమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ నియోజకవర్గ శాసన సభ్యులు గా ఉండడం నా అదృష్టం
ప్రజల సేవ చేయడమే నా బాధ్యత..
నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం
ఇందూర్ వార్త : జుక్కల్, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శాసన సభ్యులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు నియోజకవర్గ ప్రజాలందరికీ శుభం కలగాలని, మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను..మీకు సేవ చేయడమే నా భాగ్యం మరియు నా బాధ్యత.. నేను ఈ సందేశాన్ని నా పూర్ణ మనసుతో, కృతజ్ఞతతో మరియు వినయంతో రాస్తున్నాను..గత నెల 30న రాత్రి అనుకోని ఆరోగ్య సమస్యను ఎదుర్కొనీ.. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా నా కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు , కొన్ని రోజుల పాటు ఐ సి యు లో ఉంచి చికిత్స చేయించుకున్నాను జూన్ 6వ తేదీ వరకు నేను ఆసుపత్రిలో ఉన్నాను.. ఆ రోజులు నాకు మరియు నా కుటుంబానికి ఎంతో కష్టంగా అనిపించింది నా ఆరోగ్యాన్ని తిరిగి సానుకూలించటం అసాధ్యమైపోతుందేమోనని కొన్ని సందర్భాల్లో నాకు అనిపించింది. నియోజక వర్గ ప్రజల ఆశీర్వాదం, అందించిన మద్దతు, ప్రార్థనలు, ప్రేమతో నేను తిరిగి ఆరోగ్యవంతుడిగా అయ్యాను. మీరు పంపిన ఆదరణ సందేశాలు, నా ఆరోగ్యాన్ని గురించి మీరు చేసిన ప్రయత్నాలు, చేసిన ప్రార్థనలు—నాకు ఎంతగానో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి.. మీ అందరి సానుభూతి మరియు ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి..నా ఆరోగ్యం గురించి విచారిస్తూ నన్ను చూసేందుకు వచ్చినవారికి, సందేశాలు పంపిన వారికి మరియు నాకు మానసికంగా ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. మీరు అందించిన శుభాసిస్సుల వల్లే నేను బలంగా తిరిగి నిలబడగలిగాను.. నేను పూర్తిగా కోలుకుంటున్న ఈ సమయంలో, మీ అందరికీ మరోసారి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే నా సంకల్పం ఇప్పటికీ అంతే స్థిరంగా ఉంది.. జుక్కల్ అభివృద్ధి విషయంలో, గతంలో మనం ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం.. అయినా మీ సహకారంతో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నా.. నా పూర్తి శక్తి సామర్థ్యాలు వెచ్చించి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు ముందుకు సాగుతున్నాను.. మీ ఆదరాభిమానాలు ఉంటే భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలను అనే నమ్మకం నాకు ప్రగాఢంగా ఉంది..మరొక్కసారి, జుక్కల్ నియోజకవర్గం ప్రజల అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మీ ప్రతినిధిగా ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సోషల్ మీడియా పోస్ట్ ట్వీట్ చేశారు.