ఎస్సీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ డిసెంబర్:09
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పేరువంచ గ్రామం లో మొత్తం ఒక కోటి ఒక లక్ష రూపాయలు తో గ్రామ అభివృద్ధి . ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం : పేరువంచ గ్రామం లో 25 లక్షలు రూపాయలు తో సీసీ రోడ్లు ప్రారంభం ‘ 29 లక్షలు రూపాయలు తో సీసీ రోడ్లు శంకుస్థాపన మరియు 25 లక్షలు తో ” ఎస్సీ కమ్యూనిటీ ” హల్ ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేరువంచ గ్రామం లో ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన గ్రామ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు… కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు గురించి గ్రామ ప్రజలకు తెలియజేసారు.. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు… త్వరలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు చేపడతాము అని తెలిపారు.. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు లో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి పండుగ సంబరాలు ప్రజలు జరుపుకుంటున్నారు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, పంచాయతీ ఇంచార్జ్, డి ఈ, పి ఆర్ ఏ ఈ ప్రభుత్వ అధికారులు,కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కాష్టాలా నరేంద్ర,సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, లక్కినేని కృష్ణ మరియు కల్లూరు పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పేరువంచ గ్రామ కాంగ్రెస్ నాయకులు,మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు..