చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
భిక్నూర్ నవంబర్ 13: ఇందూర్ వార్త ప్రతినిధి నవీన్ గౌడ్
మండల కేంద్రంలో రైతు వేదికలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చి చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాల కోసం దళారులను నమ్మవద్దని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందితే ముఖ్యమంత్రి సహాయనిధికి కోసం నేరుగా క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు