-
వెంకీ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ కన్‌ఫర్మ్
-
సంక్రాంతి బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
-
ఆసక్తికరంగా 2025 సంక్రాంతి పోటీ
ఇందూర్ వర్త్ వెబ్ డెస్క్ నవంబరు 01
సక్సెస్‌ఫుల్ జోడీగా పేరున్న హీరో వెంకటేశ్, అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ కలయిలో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో పాటు ‘సంక్రాంతి పోటీలో మేము ఉంటున్నాం’ అంటూ చిత్రబృందం ప్రకటించింది.
ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రామ్‌చరణ్-శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో.. ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తుండటం విశేషం. ఈ ప్రకటనతో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.