-
ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టు
-
ఇప్పటివరకూ బయటకురాని ఈ మూవీ ఒక్క అఫీషియల్ అప్డేట్
-
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేసిన జక్కన్న
-
దాంతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి ‘SSMB 29’
ఇందూర్ వార్త వెబ్ డెస్క్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ ఈ మూవీకి సంబంధించిన ఒక్క అఫీషియల్ అప్డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ కూడా ఒకింత నిరాశ చెందుతున్నారు. అయితే, తాజాగా దర్శకుడు జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశారు. దాంతో మరోసారి ఈ ప్రాజెక్టుపై చర్చ మొదలైంది. ఎడారి ప్రాంతంలో ఆయన తిరుగుతున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దానికి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు జక్కన్న. ఇక ఆ ఫొటో చూసిన అభిమానులు ఆయన ప్రిన్స్ సినిమా కోసం లొకేషన్స్ వెతకడానికే అక్కడికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అవ్వడం వల్ల కచ్చితంగా ఆయన ఈ పని మీదనే వెళ్లారని ఖుషీ అవుతున్నారు. త్వరగా మూవీ తాలూకు అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మూవీ టీమ్ మొత్తం ‘SSMB29’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఇక ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే మహేశ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న సూపర్‌స్టార్ రగ్గడ్ లుక్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది