118 కేజీల గంజాయి పట్టివేత
రెండు ఆటోలు స్వాధీనం
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. పరారీ లో ఒకరు
ఇందూర్ వార్త అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఒరిస్సా కలిమెల నుంచి హైదరాబాద్ కు ఆటోలో అక్రమంగా తరలి వెళ్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఒరిస్సా కలిమెళ్ళ నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోలో గంజాయి వెళుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు.
అనుమానంగా వచ్చినటువంటి రెండు ఆటల్లో తనిఖీలు నిర్వహించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 118 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు.
గంజాయి తో పాటు రెండు ఆటో లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
పట్టుకున్న గంజాయి, వాహనాల విలువ కలిపి రూ. 31.50 లక్షలు గా ఉంటుందని ఎక్సైజ్ సూపర్ డెంట్ కరమ్ చందు తెలిపారు.
అరెస్టు కాబడిన వ్యక్తుల్లో హైదరాబాద్ కు చెందిన కనిగల స్వాతిక్, మణుగూరు కు చెందిన గుంజు ఆమోస్ ను అరెస్టు చేయగా,సపా వత్ వెంకన్న పరారీ లో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, అన్నారుగురవయ్య, సుమంత్, శ్రావణి, రమేష్ పాల్గొన్నారు.
గంజాయిని పట్టుకున్నటువంటి టీమును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిడెంటు జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య అభినందించారు.
వి.బి. కమలాసన్ రెడ్డి ఐపీఎస్,
డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్,
ప్రొహిబిష తెలియజేశారు.
Tuesday, December 24
Trending
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!