హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
జనవరి 27 నుండి ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష
బి సి ఏ సాధన కోసం అన్ని సంఘాలు కలిసి రావాలి
ముదిరాజ్ నేతల పిలుపు.
ఇందూర్ వార్త డిసెంబర్ 29:
ముదిరాజుల బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరించే బీసీఏ సాధన కోసం రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలన్నీ రాజకీయాల కతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ తో పాటు వివిధ ముదిరాజ్ సంఘాల నేతలు అల్లాదుర్గం సురేష్, సలేంద్ర శివయ్య, కొరివి లక్మన్ ,బుల్లెట్ వెంకన్న ,రవీందర్,దిగంబర్, నగేష్ తదితరులు పిలుపునిచ్చారు. గురువారం బీసీ సాధికారిత భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు .సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు కోసం ముదిరాజుల బీసీ ఏ లో చేర్చాల్సిన అవసరం అని పేర్కొన్నారు .రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ మన సమస్యలను గుర్తించి వాటికోసం ఒక నిర్దిష్టమైన విధానాలతో ముందుకు సాగకపోవడం వల్లే మన హక్కులు సాధించుకోలేకపోతున్నామని అన్నారు .బీసీఏ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27 నుండి ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జగన్మోహన్ ప్రకటించారు.ఇందుకోసం అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు ముదిరాజులను బీసీఏలో చేర్చే విషయంపై ఉత్తరాలు రాసి ప్రత్యేకంగా వారితో చర్చించడం జరుగుతుందని అన్నారు. పాలకుల నిర్లక్ష్య పలితంగా గత గత ఐదు దశాబ్దాలకు పైగా బీసీఏ సాధన కోసం పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాల నుండి సానుకూలంగా స్పందన రావడంలేదని ఆయన విచారణ వ్యక్తం చేశారు .గత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో జీవో నెంబర్ 15 ద్వారా ముదిరాజులను బీసీలలో చేర్చినప్పటికీ ఆ వెంటనే దానిని హైకోర్టు కొట్టివేయగా ఈటెల రాజేందర్ తో పాటు ఇతరుల సహకారంతో సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ వేసినప్పటికీ ఇటీవలనే దానిని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి బీసీ కమిషన్ కు తిరిగి పరిష్కారం కోసం పంపి వేసిందని అది జరిగి రెండు నెలలు గడిచిన ఎవరు దానిపై ఊసెత్తక కపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ హక్కుల కోసం కొందరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అవి తమ వ్యక్తిగత ఉనికి చాటు కోవడంతో పాటు రాజకీయంగా ఎవరికి వారే అభివృద్ధి చెందే విధంగా ఉన్నాయి తప్ప జాతి ప్రయోజనాలను పరిరక్షించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .అందరి సహకారంతో జనవరి 27 నుండి నిర్వహించే ఆమరణ నిరాహార దీక్షకు అందరూ మద్దతు నివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మాట్లాడిన పలువురు నేతలు ముదిరాజ్ సామాజిక వర్గం లో అన్ని వర్గాల వారు ఒకే వేదికపై వచ్చి ముదిరాజులు ఎదుర్కొంటున్న బీసీఏ సాధన కోసం సర్కార్లను నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు .హక్కుల సాధన కోసం ఒక్క సంఘము ఒక్క వ్యక్తులు కాకుండా సమిష్టిగా పోరాటాలు చేసేందుకు జేఏసీ ఏర్పాటు చేయాలని సూచించారు .1970- 72 ప్రాంతంలో అనంతరామన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా నేటికీ బీసీల రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి తప్ప కొత్తగా ఏ ఒక్క జాతిని కూడా బీసీఏలో చేర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008- 11 లో కొన్ని జాతులను బీసీఏలో చేర్చినప్పటికీ ముదిరాజులను మాత్రం బీసీఏలో కలపకుండా కొందరు కుట్రపూరిత వైఖరితో వ్యవహరించడం వల్లనే ముదిరాజులు బీసీ డీలోనే ఉండి విద్య ఉపాధి రాజకీయ రంగాలలో తగినటువంటి రిజర్వేషన్ లేక వెనుకబడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గెలుపు ఓటమి ప్రభావితం చేసే ముదిరాజులు ఉన్నప్పటికీ వాడిని సరియైన రీతిలో ముందుకు తీసుకెళ్లే నాయకులు కరువయ్యారని వాపోయారు కొందరు అధికార పార్టీతో చిటపటలేసుకొని జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే మరికొందరు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటాలు చేయకుండా రాజ్యాధికారం రావాలంటే మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు .వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ ఒక్కతాటిపై వచ్చి ముదిరాజులు ఎదుర్కొంటున్న బీసీఏ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముదిరాజులపై జరుగుతున్న అత్యాచారాలను వీడీసీలు పెడుతున్న ఆంక్షలు కుల బహిష్కరణ లాంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా కథలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్ సంఘాల నేతలు యాదగిరి శ్రీనివాస్ లక్ష్మణ్ జానకిరామ్ బిక్షపతి సురేష్ గారు శివయ్య ముదిరాజ్ లక్ష్మణ్ ముదిరాజ్ కిరణ్ రాజ్ ధర్నా రాజు బుల్లెట్ వెంకన్న వెంకటస్వామి బండి కృష్ణ తో పాటు వివిధ జిల్లా,నియోజకవర్గం,మండలం,ప్రాంతాలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొని ఆమరణ నిరాహార దీక్షకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి