స్వాతంత్య్ర పోరాటంలో వీర నారీమణులు
Aug 15, ఇందూర్ వార్త
స్వాతంత్య్ర పోరాటంలో వీర నారీమణులు
భారతదేశ స్వాతంత్య్ర కోసం ఎందరో పోరాటం చేశారు. ఎందరో ప్రాణత్యాగం చేశారు. అయితే భారత మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొని.. మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్, భికాజీ రుస్తుం కామా, సరోజినీ నాయుడు, ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి, సుచేతా కృపలానీ, అరుణ అసఫ్ అలీ, కమలాదేవి ఛటర్జీ, అవిరాణి వాస్తవ, కమలానెహ్రూ ఇలా స్వాతంత్య్ర సమరభేరిలో పోరాడిన మహిళా మణులు ఎందరో ఉన్నారు.
భారత స్వాతంత్య్ర దినోత్సవం.. అరుదైన ఫొటో!
బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతీయులకు ఆగస్టు 15, 1947న విముక్తి కలిగింది. ఎందరో దేశభక్తుల ప్రాణత్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించింది. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు అవిశ్రాంతంగా భారతీయుల స్వాతంత్య్ర పోరాటం సాగింది. పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్య్రం భారతీయులకు స్వేచ్ఛా వాయువులు అందించింది. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఫొటోలు మనలో దేశభక్తిని ప్రజ్వలిల్లేలా చేస్తాయి. అలాంటి చారిత్రాత్మక ఘట్టాలకు సంబంధించిన అరుదైన ఫొటో ఇది.
స్వతంత్య్రం వచ్చినప్పుడు మహాత్మాగాంధీ ఎక్కడ ఉన్నారో తెలుసా?
మహాత్మాగాంధీ స్వతంత్రం వచ్చిన రోజున బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుందని, ఇందులో పాల్గొనాలని కోరినప్పుడు కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలనని సమాధానం ఇచ్చారు.