పలు రాష్ట్రాల్లో సీడీఏ సేవలు అభినందనీయం
కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేందర్ గౌడ్.
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్
ఇంటికి దీపం ఇల్లాలంటారు.ఏ ఇంట్లో అయితే మహిళలు ఆర్థికంగా వెలుగుతుంటారో ఆ కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో
ముందుంటాయనే సంగతి జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి” సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్” సంస్థ పనిచేయడం గర్వించదగ్గ విషయమని శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలోని చండ్రుపట్ల రోడ్డు నందు సి డి ఏ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేందర్ గౌడ్ అన్నారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం హర్షణీయమన్నారు.సి డి ఏ నిర్వాహకులు రెవరెండ్ పి ఎనోష్ కుమార్ ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టుమిషన్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు బ్యాచ్ లకు శిక్షణ పూర్తిచేసుకొని 5వ బ్యాచ్ కి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడం సంతోషకరమన్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించటం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తు లో సి డి ఏ సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా పనిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు.సి డి ఏ సంస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న పి ఏనోష్ కుమార్ ని అభినందించారు. తదుపరి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ తో పాటు కుట్టు మిషన్ అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సి డి ఎ నిర్వాహకులు రెవరెండ్ పి ఏనోశ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కొక్క బ్యాచ్ కి శిక్షణ పూర్తయ్యేసరికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. బ్యాచ్ కి 20 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళల అభ్యున్నతతో పాటు ప్రజల స్థానిక అవసరాల మేరకు గ్రామాలలో మంచినీటి కోసం చేతి బోర్లు వేయించడం జరిగిందని ఇప్పటికే 40 బోర్లు వేయించామని తెలిపారు.నిరుపేద పిల్లలకు, అనివార్య కారణాలతో గాని, అనారోగ్య పరిస్థితుల వల్ల గాని తండ్రి లేదా తల్లిని కోల్పోయిన పిల్లలకు ఎడ్యుకేషన్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నత విద్యకు సి డి ఏ సహకరిస్తుందని తెలిపారు.సామాన్యుల జీవన శైలికి తగ్గట్టుగా పని చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.చంద్రలీల, కాటేపల్లి రజనీకాంత్, కాటేపల్లి కిరణ్,ఏఐసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాశి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు డేవిడ్ రాజు,తేళ్ళ ఎబినేజర్,సమర్పణ పాల్, టెక్నో నాగిరెడ్డి, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.