రామారెడ్డి:
— మా వ్యవసాయ పట్టాభూమి స్థలంలో అక్రమంగా స్మశాన వాటిక కట్టి మమ్ములను భయ బ్రాంతులకు గురి చేస్తున్న గ్రామ సర్పంచ్ వి డి సి సభ్యులు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపుర్ గ్రామంలో ఎరుకల రాజు మంజుల మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం మా వ్యవసాయ పట్టా భూమి సర్వే నంబర్ 298. 299/అ /2 స్మశాన వాటిక కొరకు 15 గుంటల భూమి గ్రామ సర్పంచ్ వీడిసి సభ్యులు స్మశాన వాటిక కొరకు తీసుకొని వేరే వద్ద ఎకరం భూమి ఇస్తామని చెప్పి మేము మా భూమి ఇవ్వమని చెప్పినప్పటికీ మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ మామ పింఛన్ కట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి గ్రామపంచాయతీలో నలుగురు సమక్షంలో పేపర్ రాసుకొని ఇప్పుడు పేపర్ చింపివేసి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మీరు స్మశాన వాటిక కూలగొడితే మీపై కేసులు చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేశారు ఇప్పుడు మాట మార్చి స్మశాన వాటిక పగలగొట్టుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ భూమి మాత్రం ఇవ్వమని తెలపడం జరిగింది స్మశాన వాటిక సిమెంట్‌తో సలాకతో కట్టడం జరిగిందని అది కూలగొట్టడానికి ఏ జెసిపిలు కూడా రావడం లేదని కనీసం సర్పంచ్ విడిసి సభ్యులు నిలబడి కూలగొడితే బాగుంటుంది అని కోరడం జరిగింది దయచేసి అధికారులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాకు భూమి ఇచ్చి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నామని అన్నారు