*సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని*
*-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించాలని కోరుచున్నాము…*
*-లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షుడు కాట్రొత్ రవీందర్ నాయక్….*
ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 05
కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండలం భారతదేశంలో కోట్ల జనాభా కలిగి ఉండి బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజాభివృద్ధికి చైతన్యానికి బంజారా బిడ్డలను భక్తి మార్గంలో నడిపించేలా చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేశారు, అలాంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజారా(లంబాడి) బిడ్డలను గుర్తించి సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరం మా బంజారా జాతి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అదేవిధంగా భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు వారి వారి పండుగలకు సెలవు దినం ఉంది కానీ నేటికీ బంజారా పండుగలకు సెలవు దినం లేదు అదే 15 ఫిబ్రవరి నాడు జరిగే 284 వ సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించాలని కోరుచున్నాము.